దేశవ్యాప్తంగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూత

రిపోర్టర్: అశోక్ స్థలం: India

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనికి తోడు సెప్టెంబర్ 25 నాలుగో శనివారం, సెప్టెంబర్ 27 ఆదివారం సెలవులు రానున్నాయి. దీంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్లు తమ అత్యవసర పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. అయితే డిజిటల్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.