'నిరూపిస్తే భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తా': సీఎం రేవంత్ ఆరోపణలపై కవిత ఫైర్

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూములపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత తీవ్రంగా ఖండించారు. సిద్ధిపేట జిల్లాలో తనకు, తన భర్త పేరిట భూములున్నాయంటూ సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. తనపై నిరూపిస్తే అదనపు భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ఈ భూముల వ్యవహారంపై వెంటనే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.