టీఎన్ 07 సీఎం 2031 నంబర్ ప్లేట్ పై చెన్నైలో దుమారం

రిపోర్టర్: సురేష్ స్థలం: చెన్నై

తమిళనాడులోని చెన్నైలో వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్ ప్రయాణించిన లగ్జరీ కార్ పై ఉన్న టీఎన్ 07 సీఎం 2031 నంబర్ ప్లేట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక ప్రైవేట్ షూటింగ్ లో భాగంగానే ఈ నంబర్ ప్లేట్ ను ఉపయోగించినట్లు వీసీకే కోశాధికారి ఎస్ ఎస్ బాలాజీ స్పష్టం చేశారు. అయితే దీనిని రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.