షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాకు రూ. 665 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Mumbai

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కింగ్ చిత్రం విడుదలకు ముందే భారీ వ్యాపారం సాధించిందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి సంబంధించి రూ. 665 కోట్ల మేర ప్రీ రిలీజ్ డీల్స్ కుదిరినట్లు సమాచారం. దేశీయ, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా ఈ భారీ మొత్తం సమకూరినట్లు చిత్ర యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి.