కీర్తి సురేష్ డోరతీ సినిమా ట్రైలర్ విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: తమిళనాడు
ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైకాలజికల్ యాక్షన్ డ్రామా చిత్రం డోరతీ. ఈ సినిమాకు సనంత్, రిషి కాంత్ హీరోలుగా నటిస్తుండగా, మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తమిళనాడు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.