భద్రతా వలయంగా మారుతున్న పలాసలో గణేష్ మండపాల ఆకస్మిక తనిఖీ
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కాశీబుగ్గ డీఎస్పీ టీ భవాని బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ భద్రత పాటించాలని, డీజేల నిబంధనలు ఉల్లంఘించవద్దని ఆమె హెచ్చరించారు.