రణబాలి చిత్రం నుంచి ఏందయ్యా సామీ పాట విడుదల చేసిన మేకర్స్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: భారతదేశం

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రణబాలి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రం నుంచి ఏందయ్యా సామీ అంటూ సాగే పెళ్లి పాటను మేకర్స్ విడుదల చేశారు. అజయ్-అతుల్ సంగీతం అందించిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించగా, శ్వేతామోహన్, అజయ్ గోగవలే ఆలపించారు.