కొండపి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోరిన మంత్రి డోలా స్వామి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ప్రకాశం
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటూ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం విజయవంతంగా నెరవేర్చిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరియు కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. కొండపి నియోజకవర్గం పరిధిలోని టంగుటూరు మండలంలోని పలు గ్రామాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజలకు నిత్యం మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ఓటర్లను ఆయన అభ్యర్థించారు.