ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్న కాంగ్రెస్ తీరుపై జగదీశ్‌రెడ్డి ఆగ్రహం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రైవేటు ఆస్తుల దగ్గరకు వెళ్లడం మానుకుని ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనపై చేసిన భూ ఆరోపణలు అవాస్తవమని తేలిపోయాయని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.