విజయనగరం జిల్లాలో గొలుసు దుకాణాల మద్యం విక్రయాలపై అబ్కారీ శాఖ ఉక్కుపాదం
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గొలుసు దుకాణాల్లో జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై అబ్కారీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 15 వరకు సుమారు 40 గొలుసు దుకాణాలపై కేసులు నమోదు చేసి 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనాథుడు తెలిపారు. ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలతో దాడులు ముమ్మరం చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.