ట్రాన్స్జెండర్లకు మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యులుగా చారిత్రాత్మక అవకాశం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ట్రాన్స్జెండర్లకు సముచిత స్థానం కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యులుగా వారికి అవకాశం కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. భారతదేశంలోనే ఇలాంటి చట్టం తేవడం ఇదే మొదటిసారి. మరోవైపు, హైడ్రా కమాండోలు, ట్రాఫిక్ వాలంటీర్లుగా ఉపాధి కల్పిస్తూ వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.