నాగ్‌పూర్‌లో దారుణం: వంట చేయలేదని భార్యను చంపేసిన భర్త
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నాగ్‌పూర్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లేందుకు సిద్ధమైన భార్య యామినిని, వంట చేయలేదనే నెపంతో భర్త కృష్ణ లాల్ యాదవ్ విచక్షణారహితంగా కొట్టి గొంతు నులిమి హత్య చేశాడు. మొదట సాధారణ మరణంగా భావించినా, పోస్ట్‌మార్టమ్ నివేదికలో అంతర్గత గాయాలు బయటపడటంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు.