ముంబైలో రోడ్డు ప్రమాదంలో ఇండిగో క్యాబి క్రూ మృతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: ముంబై
ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముప్పై రెండేళ్ల ఇండిగో క్యాబిన్ క్రూ సభ్యురాలు కైనూర్ మిస్త్రీ మృతి చెందారు. విధి ముగించుకుని కంపెనీ క్యాబ్‌లో ఇంటికి తిరిగి వస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.