అన్నదాతల ఆక్రోశం: భారీ వర్షానికి కొట్టుకుపోయిన తొగుట ధాన్యం

రిపోర్టర్: రాము స్థలం: తొగుట

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో శనివారం మధ్యాహ్నం కురిసిన అకస్మిక భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆరబెట్టిన వరి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయిందని, కష్టపడి పండించిన పంట కళ్లముందే నీటిపాలవుతుండటంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారని స్థానిక బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టార్పాలిన్లు కప్పేలోపే యార్డ్ మొత్తం జలమయమై క్వింటాళ్ల కొద్దీ ధాన్యం డ్రైనేజీల్లోకి కొట్టుకుపోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.