ప్రాజెక్ట్ వర్క్ చేయలేదని గిరిజన విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

జలదంకి ఉన్నత పాఠశాలలో ప్రాజెక్ట్ వర్క్ చేయలేదనే నెపంతో పదోతరగతి గిరిజన విద్యార్థి చైతన్యను ఆంగ్ల ఉపాధ్యాయుడు ఏసుదాసు విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన బాలుడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యానాదుల సంక్షేమ సంఘం నేతలు బాలుడిని పరామర్శించి ఉపాధ్యాయుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఈవో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.