వైఎస్సార్సీపీ నేత ఇంట్లో తెలంగాణ మద్యం స్వాధీనం: పోలీసుల దాడిలో అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: పల్నాడు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన భారీ మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థి కొప్పుల రవి నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా సుమారు నూట ఇరవై తొమ్మిది తెలంగాణ మద్యం సీసాలు లభించాయి. దీంతో రవితో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఖాసింవలి వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.