కావలిలో రహదారుల ఆక్రమణల దందా: బంకులు ఏర్పాటు చేసి అద్దెలకు ఇస్తున్న వైనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: కావలి

కావలి పట్టణంలో రహదారుల అంచున ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించి అనధికారికంగా బంకులు ఏర్పాటు చేస్తున్నారని, వాటిని ఇతరులకు అద్దెకు ఇస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావలి- సీతారామపురం జాతీయ రహదారితో పాటు పలు ప్రధాన రోడ్లలో నాయకుల కనుసన్నల్ లో ఈ దందా కొనసాగుతోందని, రోడ్లపైనే వాహనాల పార్కింగ్ వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని పట్టణ ప్రజలు వాపోతున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ తెలిపారు.