గణనాథుని పూజలతో పులకించిన ఆసిఫాబాద్ పోలీసు ప్రధాన కార్యాలయం

రిపోర్టర్: Riyaz Khan స్థలం: ఆసిఫాబాద్

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఏఆర్ హెడ్క్వార్టర్స్లో వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుని ప్రతిమకు జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ తొలి పూజలు సమర్పించారు. అనంతరం జిల్లా ప్రజలందరికీ ఆమె వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసులు సూచించిన భద్రతా జాగ్రత్తలను విధిగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు ఎన్. వామనుమూర్తి, అంజన్న, ఆర్ఎస్ఐ లవన్ కుమార్తో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.