సంచలన చిత్రానికి సీక్వెల్: ది డర్టీ పిక్చర్ పార్ట్ 2 ప్రకటన

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబై

బాలీవుడ్లో సంచలనం సృష్టించిన ది డర్టీ పిక్చర్ చిత్రానికి సుమారు పదిహేనేండ్ల విరామం తర్వాత సీక్వెల్ రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ తాజాగా ప్రకటించారు. ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సీక్వెల్లో చెప్పాల్సిన సరైన కథ తనకు ఇప్పడు దొరికిందని ఏక్తా కపూర్ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రంలో నటించే నటీనటులు, దర్శకుడి వివరాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.