పొదలకూరులో కాకాణి ప్రచారంతో వైఎస్సార్సీపీలోకి వెల్లువెత్తిన వలసలు

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని కొనగలూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారం సాగించిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ముప్ఫై కుటుంబాలు వైసీపీలో చేరాయి.