బాలిలో ఘోర ప్రమాదం: వెన్నుముక గాయంతో ముంబైకి నష్రత్ భరూచా
రిపోర్టర్: నరేష్
స్థలం: Mumbai
బాలిలో పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటి నష్రత్ భరూచాను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించినట్లు ఆమె పబ్లిసిస్ట్ వెల్లడించారు. వెన్నుముకలో ఫ్రాక్చర్ కావడంతో ముంబైలోని ఆసుపత్రిలో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇండోనేషియాలోని బాలిలో పని నిమిత్తం వెళ్లిన నటి ప్రమాదవశాత్తు గాయపడ్డారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సన్నిహితులు పేర్కొన్నారు.