మహిళల ఆసియా కప్ ఫైనల్‌లోకి శ్రీలంక దూసుకెళ్లింది

రిపోర్టర్: విజయ్ స్థలం: World

మహిళల ఆసియా కప్ సెమీఫైనల్స్ ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంక ఫైనల్‌లోకి ప్రవేశించింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ప్రారంభంలో తడబడినప్పటికీ, హర్షిత సమరవిక్రమ, కవిష దిలారి అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫైనల్ పోరులో భారత్‌తో శ్రీలంక తలపడనుంది.