గురజాడ అప్పారావు జయంతి వేడుకల్లో నివాళులు అర్పించిన కాకర్ల సురేష్
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఘన నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యానికి ఆధునిక రూపునిచ్చి, జాతీయోద్యమానికి ఉత్తేజాన్నిచ్చిన ఆ మహనీయుని చిరస్మరణీయ సాహితీ సేవలను, ఆదర్శాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. సమాజానికి కొత్త చైతన్యం నింపిన గురజాడ సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని ఆయన కొనియాడారు.