ఇథనాల్ శానిటైజర్లపై నియంత్రణ విధించాలని కేంద్రానికి ఏపీ లేఖ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

శానిటైజర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇథనాల్ శానిటైజర్లపై నియంత్రణ విధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లేఖ రాసింది. విజయవాడలో కొందరు వీటిని మద్యానికి ప్రత్యామ్నాయంగా వాడుతున్నట్లు గుర్తించారు. ప్రాణాలను కాపాడేందుకు కోవిడ్ మినహాయింపులను రద్దు చేసి, కఠిన నిబంధనలు అమలు చేయాలని డీజీ పి.అరుణ్‌బాబు విజ్ఞప్తి చేశారు.