మంచిర్యాల టీ పాయింట్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలతో యువతకు గట్టి హెచ్చరికలు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ టీ పాయింట్ల వద్ద ఉన్న స్మోకింగ్ జోన్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించడంతో పాటు సిగరెట్లు తాగుతున్న యువకులకు అవగాహన కల్పించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరించడం జరిగింది.