పిఠాపురంలో ఉద్రిక్తత: రీ పోలింగ్ నిర్వహించాలంటూ జనసేన నేతల డిమాండ్

రిపోర్టర్: మహేష్ స్థలం: Kakinada

కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చివరి నిమిషంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాదాలపేటలో జనసేన ఏజెంట్లను అనుమతించకపోవడంతో పాటు రిగ్గింగ్ జరిగిందని ఆ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ ఘటనపై ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టామని, 19వ వార్డులో వెంటనే రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామని జనసేన నాయకులు తెలిపారు.