భారత్ తో టీ20 సిరీస్ కు దూరమైన రచిన్ రవీంద్ర

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Zealand

భారత్ తో జరగనున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రచార చిత్రాల షూటింగ్ లో గాయపడిన రచిన్ కోలుకోవడానికి ఆరు వారాల సమయం పట్టనుందని, నవంబర్ లో జరిగే వన్డే సిరీస్ కు అందుబాటులోకి వస్తాడని హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. మిచెల్ సాంట్నర్ కెప్టెన్ వ్యవహరిస్తున్న ఈ జట్టులో ఒక ఏడాది తర్వాత ఆడం మిల్నే పునరాగమనం చేశాడు.