వైకాపా నేత మేకపాటి విక్రమ్రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర నిప్పులు

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆత్మకూరు

వైకాపా నేత మేకపాటి విక్రమ్రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాలు చేతకాక అసమర్థతతో ఇతరులపై నిందలు వేయడం తగదని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆత్మకూరులో మేకపాటి విక్రమ్రెడ్డికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సవాల్ విసిరారు. ప్రజల మద్దతు లేకనే వైకాపా నేతలు తమపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు.