ప్రజాపాలన స్ఫూర్తితో మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ వేడుకల్లో కమిషనర్ తన్నీరు రమేష్, మేనేజర్ మజహర్, ఆర్వో భుజంగరావు, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.