బెంగళూరులో భారీ పేలుడు కలకలం: నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదం
రిపోర్టర్: రమేష్
స్థలం: Bengaluru
బెంగళూరు పులకేశి నగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన అకస్మాతిక పేలుడు తీవ్ర కలకలం రేపినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ వెల్లడించారు. రోడ్డుపై దొరికిన బ్యాటరీ లాంటి వస్తువును పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ నిపుణులు, ఉగ్రవాద నిరోధక దళం సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.