విశాఖ ఉక్కు కర్మాగారంలో మరోసారి నేలపాలైన ద్రవ ఉక్కు

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ విభాగంలో ద్రవ ఉక్కు నేలపాలైందని వర్గాలు వెల్లడించాయి. ల్యాడిల్ ద్వారా ద్రవ ఉక్కు తరలిస్తుండగా స్లైడ్ గేటు ఊడిపోవడంతో సుమారు నూట యాభై టన్నుల ద్రవ ఉక్కు కిందకి పడిపోయింది. కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి పునరుద్ధరించిన ఈ విభాగంలో మళ్లీ ప్రమాదం జరగడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.