కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్: తీవ్ర భయాందోళనలో మాచవరం గ్రామస్తులు

రిపోర్టర్: అశోక్ స్థలం: అంబేద్కర్ కోనసీమ

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో పంట పొలాల్లో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ నుంచి గ్యాస్ లీకైందని స్థానికులు తెలిపారు. ఇదే ప్రాంతంలో ఇటీవల పైప్లైన్ లీకై కలకలం సృష్టించగా, తాజాగా మళ్లీ లీక్ కావడం గ్రామస్తుల్లో ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని అదుపులోకి తెచ్చారని, ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.