యూరప్ లో జెన్ జీ నిరసనల ఉద్రిక్తత: జర్మనీలో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: జర్మనీ
యూరప్ దేశాలలో జెన్ జీ నిరసనలు తీవ్రరూపం దాల్చాయని, శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు సాయంత్రానికి హింసాత్మకంగా మారుతున్నాయని జెన్ జీ రెగెల్ట్ ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్ తెలిపారు. ఫ్రాన్స్ నుంచి జర్మనీకి పాకిన ఈ నిరసనలలో భాగంగా బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్ సహా ముప్ పై నాలుగు నగరాలలో వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. పెరుగుతున్న జీవన వ్యయం, మెరుగైన విద్య, వైద్య సేవలను డిమాండ్ చేస్తూ నిరసనకారులు పోలీసులపై రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది.