వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొట్టాలని చంద్రబాబు ఆదేశం
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ప్రధాన ప్రతిపక్షం వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలను తేలిగ్గా తీసుకోవద్దని టీడీపీ శ్రేణులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫేక్ క్యాంపెయిన్లను వాస్తవాలు, పక్కా ఆధారాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పొలిటికల్ మైండ్ గేమ్లను ఎండగడుతూ, ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.