పాలకొండలో వర్షాన్ని సైతం లెక్కచేయక సాగిన కూటమి అభ్యర్థి ప్రచారం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ పదిహేనవ వార్డులో కూటమి కౌన్సిలర్ అభ్యర్థి కొరికాన గంగు నాయుడు వర్షంలోనూ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ బలపరిచిన తనను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. చైర్మన్ అభ్యర్థి పల్లా విజయనిర్మల ఆధ్వర్యంలో పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు.