వృద్ధులకు భద్రతగా ప్రత్యేక నివాసాలు: రియల్ ఎస్టేట్ రంగంలో భారీ డిమాండ్

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

దేశంలో వయోధికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సాంప్రదాయ వృద్ధాశ్రమాలకు భిన్నంగా సీనియర్ లివింగ్ కమ్యూనిటీల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయని కొలియర్స్ సంస్థ తన అధ్యయన నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుత మార్కెట్లో ఇళ్ల కొరత తీవ్రంగా ఉందని, రాబోయే రోజుల్లో ఈ రంగంలో లక్ష కోట్ల వ్యాపార అవకాశాలు రానున్నాయని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. మెట్రో నగరాలతో పాటు టైర్-2 పట్టణాల్లోనూ ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ నివాసాలకు డిమాండ్ భారీగా పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.