సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన బండి పట్టాభి రెడ్డి

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

గంగాధర నెల్లూరు మండలంలోని ఆర్టీఐ-ఏఎస్ జాతీయ ఉప కార్యాలయంలో అంతర్జాతీయ సమాచార హక్కు చట్టం దినోత్సవాన్ని రాష్ట్ర కార్యదర్శి కే.గిరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు.