ఐక్యతాపథంలో ఆమనగల్లు రజక సంఘం నూతన సారథిగా నాగిళ్ల లింగం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ రజక సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా నాగిళ్ల లింగం చంటి, ఉపాధ్యక్షులుగా మద్దూరి అయోధ్య, మద్దూరి రమేష్, ప్రధాన కార్యదర్శిగా నాగిళ్ల తిరుపతయ్య ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా నాగిళ్ల బుచ్చయ్య, యాదయ్య, నరసింహను నియమించారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం అంకితభావంతో కృషి చేయాలని స్థానిక నాయకులు, సభ్యులు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో రజక సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన బాధ్యులకు అభినందనలు అందజేసి సంఘ బలోపేతానికి తోడ్పడతామని స్పష్టం చేశారు.