ఆముదాలవలస జనసేన సమన్వయకర్తగా పైడి మురళీ: డిప్యూటీ సీఎం పవన్కు కృతజ్ఞతలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆముదాలవలస

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా పైడి మురళీ మోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. జనసైనికులు, నాయకులను ఐక్యంగా కలుపుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ పటిష్టతకు పాటుపడతానని ఆయన మీడియా సమావేశంలో ధీమాగా ప్రకటించారు.