కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు వేగవంతమైన స్థల పరిశీలన ప్రక్రియ

రిపోర్టర్: గోపి స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాంకేతిక నిపుణుల బృందం స్థల పరిశీలన చేపట్టింది. సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలను పరిశీలిస్తున్న బృందం, పూర్తి స్థాయి సాంకేతిక అధ్యయనం అనంతరం కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది. దీనిద్వారా జిల్లాలో విమాన కనెక్టివిటీతో పాటు పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి మార్గం సుగమం కానుంది.