మంచిర్యాలలో ఉద్రిక్తత: సీఐ దాడి చేశారంటూ అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయింపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో బతుకమ్మ సంబురాల సమయంలో గిరిజన మహిళా సర్పంచ్ కుర్సింగ కళావతి, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతిపై సీఐ రమణ మూర్తి అకారణంగా దాడి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని స్థానికులు వెల్లడించారు.