రైతన్నలకు తీపి కబురు: మీ భూమి మీ హక్కు కింద పాసుపుస్తకాల పంపిణీ

రిపోర్టర్: హరి స్థలం: Prakasam

ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. నరసింగోలు గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు అని AP CM Office వెల్లడించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అలాగే పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని భూ హక్కు పత్రాలు అందుకున్నారు.