ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సభ్యుడిగా అభిరామ్ సింగ్ నియామకం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Dubai
ఇండోనేషియా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అభిరామ్ సింగ్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ అసియేట్ మెంబర్ స్థానానికి ఎన్నికయ్యారు. జెర్సీకి చెందిన సారా గోమెర్సాల్, జర్మనీకి చెందిన విగనే శంకర్‌లతో త్రిముఖ పోటీలో ఆయన విజయం సాధించారు. ఫ్రెంచ్ క్రికెట్ బోర్డుకు చెందిన గురుమూర్తి పలాని ఐసీసీ బోర్డుకు వెళ్లడంతో ఏర్పడిన ఖాళీని ఆయన భర్తీ చేస్తారని ఐసీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.