తిరుపతి అభివృద్ధికి రూ.3,222 కోట్ల ప్రాజెక్టులతో పాటు వెంకటాద్రి యాప్ ఆవిష్కరణ

రిపోర్టర్: అశోక్ స్థలం: Tirupati

తిరుమల యాత్రికుల సౌకర్యార్థం నూతనంగా రూపొందించిన వెంకటాద్రి నావిగేషన్ యాప్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్లైన్లోనూ పనిచేసే ఈ యాప్తో పాటు, తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.3,222 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. నగరంలో మౌలిక వసతుల కల్పనతో పాటు భక్తుల రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.