స్థానిక పోరులో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలన్న శ్రావణ్ కుమార్
రిపోర్టర్: Thrinadh Rudi
స్థలం: పెదబయలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో నిర్వహించిన మండల సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్ను దొరతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక పోరులో విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు.