నేపాల్‌కు భారత్ భారీ విద్యుత్ సాయం

రిపోర్టర్: వెంకట్ స్థలం: నేపాల్

తీవ్ర వరదలతో అంధకారంలో చిక్కుకున్న నేపాల్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. డిసెంబర్ వరకు ప్రతిరోజూ 18 గంటల పాటు 654 మెగావాట్ల విద్యుత్‌ను నేపాల్‌కు ఎగుమతి చేయనుంది. విపత్తు కారణంగా ఆ దేశంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్లు ధ్వంసమై విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిన నేపథ్యంలో భారత్ అందిస్తున్న ఈ సాయం ఆ దేశానికి పెద్ద ఊరటనిస్తోంది.