టెక్ ప్రియులకు షాక్: గెలాక్సీ ఫోల్డ్ 9 లో అండర్ డిస్ప్లే కెమెరా
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన రాబోయే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 9 స్మార్ట్ ఫోన్ లో మళ్లీ అండర్ డిస్ప్లే కెమెరాను తీసుకురానుందని ప్రముఖ టిప్‌స్టర్ క్రో ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫోల్డబుల్ స్క్రీన్ కింద ఈ కెమెరాను అమర్చనున్నట్లు ఆయన తెలిపారు. శాంసంగ్ తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయం టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.