పెదబయలులో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం

రిపోర్టర్: Thrinadh Rudi స్థలం: పెదబయలు

పెదబయలు మండల పరిధిలో ఉదయం నుంచి తీవ్రమైన ఎండ కాయగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, వీధులు మరియు డ్రైనేజీలు నిండిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అకస్మిక వర్షంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.