రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహం: ఎస్ఐపీబీ సమావేశంలో కీలక ప్రతిపాదనలపై చర్చించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఇంధనశాఖ, పర్యాటకం, ఐటీ రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై లోతుగా చర్చించారు. గతంలో కుదిరిన ఒప్పందాలు కార్యరూపం దాల్చి ఉత్పత్తి చేపట్టడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. విశాఖలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుతో పాటు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.