తిరుమలలో పోటెత్తిన భక్తులు సిఫార్సు లేఖల దర్శనాలు రద్దు చేసిన TTD
రిపోర్టర్: సురేష్
స్థలం: తిరుమల
ప్రస్తుత పెరటాసి మాసం మూడో వారం కావడంతో తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారని TTD అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. భక్తుల రద్దడి దృష్ట్యా అక్టోబర్ 4 మరియు 5 తేదీలలో సిఫార్సు లేఖలపై ఇచ్చే ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు TTD స్పష్టం చేసింది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అందించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.